సోమవారం 25 మే 2020
Telangana - Apr 06, 2020 , 06:14:38

ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు

హైదరాబాద్‌ : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. దక్షిణ కేరళ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఒకటి,  పశ్చిమబెంగాల్‌ నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. నైరుతి మధ్యప్రదేశ్‌, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపారు. మరోవైపు, రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ఠం 23.1 డిగ్రీ లు, గాలిలో తేమ 36 శాతంగా నమోదైంది. నాలుగురోజులు గ్రేటర్‌లోని పలుచోట్ల వర్షా లు కురువొచ్చని అధికారులు చెప్పారు.


logo