శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 06, 2020 , 05:52:35

నేడు, రేపు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం..

నేడు, రేపు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం..

హైద‌రాబాద్‌:  ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. పంట నూర్పిడి చేసిన రైతులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.  తూర్పు బీహార్ నుంచి ద‌క్షిణ ఇంటిరియ‌ల్ త‌మిళ‌నాడు వ‌ర‌కు ఆగ్నేయ మ‌ధ్య‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, రాయ‌ల‌సీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉప‌రిత‌ల ద్రోణిఆవ‌రించి ఉంది. దీని ప్ర‌భావంతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని, వ‌డ‌గండ్లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. పిడుగులు కూడా ప‌డే అవ‌కాశం ఉన్నందున రైతులు చెట్ల‌కింద ఉండ‌వ‌ద్ద‌ని కోరారు.  


logo