శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 06:33:43

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

హైదరాబాద్ : ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌, లోకేశ్వరం, సారంగపూర్‌, ముథోల్‌, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, బోథ్‌, నిజామాబాద్‌ జిల్లా నందిపేట, కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆదివారం కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశమున్నదని, సోమ, మంగళవారాల్లో పొడివాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. అబ్జర్వేటరీలు లేని ప్రాంతాల్లో ఎక్కడైనా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిస్తే తమ దృష్టికి తీసుకురావాలని మీడియాను కోరారు.


logo