సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 22:19:48

ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు

హైదరాబాద్  : మరాట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఈ రోజు మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిశాయి. ఆదిలాబాద్‌ తలమడుగులో అత్యధికంగా 29.3 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది.logo