మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 18:05:55

తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు!

తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు!

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ సోమవారం  తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరుగా కురవనున్నట్లు పేర్కొంది. ఉత్తర బంగాళా ఖాతం పరిసరాల్లో త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఇవాళ, రేపు, ఎల్లుండి, రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  ఇప్పటికే పడిన వర్షాలకు కొన్నిచోట్ల గ్రామాల్లో రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటారు. మరోసారి వర్షం పడితే రాష్ర్ట మంతటా ప్రభుత్వం సూచించిన పంటలను పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్నిచోట్ల ఎరువులు, విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉంచగా.. రైతులు సాగు పనుల్లో బిజీగా గడుపుతున్నారు.  


logo