శనివారం 06 జూన్ 2020
Telangana - May 13, 2020 , 15:28:24

మూడు రోజులు వర్ష సూచన

మూడు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

రాష్ట్రంలో ఓ వైపు వర్షంలో పాటు రెండు రోజులు అక్కడక్కడ 40-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు, మరికొన్ని చోట్ల వేడి ప్రతాపం చూపనున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల రైతులు తమ ధాన్యం అమ్మకానికి మార్కెట్లకు తీసుకుని వెళ్ళారు. మరి కొంత మంది రైతులు పొలాల్లో ధాన్యాన్ని ఆరబోసారు. అటువంటి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.


logo