సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 17:20:27

రాష్ట్రంలో వర్షాలు..పలుచోట్ల రాళ్లవాన

రాష్ట్రంలో వర్షాలు..పలుచోట్ల రాళ్లవాన

హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం చెదురుముదురుగా వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలుచోట్ల రాళ్లవాన పడినట్టు వార్తలు అందాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో, చౌటుప్పల్‌లో, ఇంకా వరంగల్ జిల్లా పాలకుర్తి తదితర ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసింది. అకాలవర్షం, అందులోనూ రాళ్లవాన కావడంతో పండ్లతోటలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.   




logo