శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 13:01:36

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్‌, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం కురింది. అలాగే మలక్‌పేట, చార్మినార్‌, సుల్తాన్‌బజార్‌, కోఠి, ఖైరతాబాద్‌, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్‌లో వాన పడింది. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లుపై వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికీ పలు కాలనీల్లో నీరు నిలిచే ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంకా సహాయ చర్యలు చేపడుతున్నారు. ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కరోనా సంక్రమణ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు నిర్వహణ సహాయ బృందాలతో క్రిమి సంహారక మందు స్ప్రే చేయిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.