గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 18:07:43

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన జోరుగా కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, రాంనగర్‌, భోలక్‌పూర్‌, అడిక్‌మెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడనునట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

logo