శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 18:37:25

భారత్‌ - దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌ రద్దు

భారత్‌ - దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌ రద్దు

ధర్మశాల: భారత్‌ - దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌ రద్దయింది. ఉదయం నుంచి వర్షం కారణంగా ధర్మశాల వన్డేను రద్దు చేసినట్లు నిర్వహకులు ప్రకటించారు. ధర్మశాలలో ఇలా జరగడం ఇది రెండోసారి. గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ 20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.  ధవన్‌, హార్దిక్‌, భువీ తిరిగి రావడంతో టీమ్ ఇండియా పటిష్ఠంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు ఆస్ట్రేలియాని క్లీన్ స్వీప్ చేసిన ద‌క్షిణాఫ్రికా కూడా మంచి ఊపులో ఉంది. ఇదిలా ఉంటే  క‌రోనాతో పాటు వ‌ర్షం కార‌ణంగా స్టేడియంకి వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య భారీగా త‌గ్గింది. స్టాండ్స్ అన్నీ ఖాళీగా క‌నిపిస్తున్నాయి. 


logo