శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 09:48:47

నేడు తెలంగాణకు వర్ష సూచన

నేడు తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్‌ : నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉండగా, రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా, మంచిర్యాల జిల్లాలో 6.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ పేర్కొంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల‌, నిజామాబాద్, జగిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల, పెద్దపల్లి, క‌రీంన‌గ‌ర్‌, జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి, ములుగు, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, జ‌న‌గామ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం హెచ్చరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo