బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 21:28:39

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు

హైదరాబాద్‌ : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండ‌పోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్లు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండగా రహదారులపై భారీగా వరద ప్రవాహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కార్లు, బైకులు నీటమునిగాయి. దీంతో విజయవాడ -హైదరాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo