గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 09:45:08

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

కడెం: నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఏడు వందల అడుగులు కాగా, ప్రస్తుతం 678 అడుగులకు చేరింది. మొత్తం 7603 టీఎంసీలకుగాను 3,295 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. ఎగువ నుంచి 1835 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. 


logo