e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News రానున్న మూడురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

రానున్న మూడురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

రానున్న మూడురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5-2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ద్రోణి ఆవరించి ఉంది. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు విస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రానున్న మూడురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement