శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:28

ఆర్పీఎఫ్‌లో తొలి మహిళా ఎస్సైలు

ఆర్పీఎఫ్‌లో తొలి మహిళా ఎస్సైలు

  • వేడుకగా పాసింగ్‌ అవుట్‌పరేడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మౌలాలిలోని రైల్వే ప్రొటెక్షన్‌ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌) శిక్షణాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మొదటిమహిళా ఎస్సైల పాసింగ్‌ అవుట్‌పరేడ్‌కు ముఖ్యఅతిథిగా ఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా ఎస్సైలను అభినందించారు. రైల్వే ఆస్తులను పరిరక్షించడంతోపాటు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లల భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా మాట్లాడుతూ.. రైల్వే ఆస్తులను పరిరక్షించడంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్సైఈలకు సర్టిఫికెట్‌, మెడల్స్‌ అందజేశారు. వీ ప్రజ్ఞ ఉత్తమ క్యాడెట్‌ మెడల్‌, బెస్ట్‌ అవుట్‌ డోర్‌ ఈవెంట్స్‌ మెడల్‌ను అందుకోగా, బెస్ట్‌ ఇండోర్‌ ఈవెంట్స్‌ ప్రాచీ అందుకున్నారు. శిక్షణలో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల నుంచి మొత్తం 164 మంది 9 నెలలపాటు ఇక్కడ శిక్షణ పొందారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ ఐజీ సంజయ్‌ సాంక్రిత్యాన్‌, ఆర్పీఎఫ్‌ ఐజీ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.logo