బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 00:49:40

గడ్డి పీకమన్నారని కీమెన్‌ ఆత్మహత్య

గడ్డి పీకమన్నారని కీమెన్‌ ఆత్మహత్య

  • ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం
  • పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఏపీలో ఓ రైల్వే కీమెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులను సెల్ఫీ వీడియోలో వివరిస్తూ గురువారం పురుగుమందు తాగాడు. ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం రాయనపాడు గ్రామానికి చెందిన పెయ్యాల రాజు (39) రైల్వేలో కీమెన్‌. కృష్ణా జిల్లా జీకొండూరు మండల మాధవరం రైల్వేస్టేషన్‌ ఏరియాలో పనిచేసేవాడు. ఇటీవల ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌ ఏరియాకు బదిలీచేశారు. తనకు పదోన్నతి ఇవ్వకుండా కీమెన్‌గానే ఉంచారని, రైల్వేట్రాక్‌ పక్కన తనను గడ్డి పీకాలని ఉన్నతాధికారులు ఆదేశించారని వాపోయాడు.

ఇలా తనపై ఏడాదికాలంగా జరుగుతున్న వేధింపులను సెల్ఫీ వీడియోలో వివరించాడు. రైల్వేపట్టాల పక్కనే పురుగుమందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగాడు. అక్కడి నుంచి బైక్‌పై ఇంటికి వెళ్లి పురుగుమందు తాగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపాడు. రాజును వెంటనే మైలవరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.


logo