మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:37:50

కొత్తగూడ ఏరియాలో రైల్వే డీఆర్ఎం పర్యటన

కొత్తగూడ ఏరియాలో రైల్వే డీఆర్ఎం పర్యటన

కొత్తగూడెం టౌన్ : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఆనంద్ భాటియా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు (బి.డి.సి.ఆర్) ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక రైల్ ద్వారా చేరుకొన్నారు. స్టేషన్ లోని కార్యాలయాలను నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను, రైల్వే హాస్పిటల్, పరిసరాలు, రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కార్మికుల కాలనీలను పరిశీలించారు. స్వచ్ఛ పక్వాడ కార్యక్రమ వివరాలను అని అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్‌తో రద్దయిన రైళ్లతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం బాధ్యుడు జి.సతీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొవ్వురు రైల్వే పోరాట కమిటీ అధ్యక్షుడు  పాండురంగ చారి వినతిపత్రాలు సమర్పించారు. భాటియా వెంట డివిజనల్ రైల్వే సీనియర్ ఉన్నతాధికారులు కృష్ణారెడ్డి, బసవరాజ్, యోగానంద బాబు, సాగర్, సురేష్, స్థానిక అధికారులు రామానాయక్, మీనా, జేమ్స్ పాల్, ఖాజా, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.