శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 19:46:20

రఘునందన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి.. ఈసీకి కాంగ్రెస్‌ లేఖ

రఘునందన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి.. ఈసీకి కాంగ్రెస్‌ లేఖ

హైదరాబాద్ : దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా బీజేపీ నగదు, మద్యం పంపిణీ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. అన్ని పార్టీల నాయకుల వాహనాలను తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించాలని ఈసీకి రాసిన లేఖలో కోరారు. మద్యం దుకాణాలు, బార్లు మూసివేసేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.