గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:22:38

ఉత్తర ప్రగల్భాలు

ఉత్తర ప్రగల్భాలు

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఎన్నో బీరాలు పలికారు. వీరి మాటలు వింటే ఉత్తరకుమారుడికే మతి పోవడం ఖాయం. దుబ్బాకకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని ఓటర్లను నమ్మించిన దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. ఎన్నికలు అయిపోగానే ఓడ మల్లయ్యగా మారారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు కూడా చెప్తున్నారు. ఎక్కడికి పోయినా, ఏ గ్రామంలో ప్రచారం నిర్వహించినా కేంద్రం నుంచి నిధులు తెస్తానని మోసపు మాటలు చెప్పిన రఘునందన్‌రావు.. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలువగానే తిరుపతి వెంకన్నకు తలనీలాలిచ్చిండు. ఇదే సమయంలో ఆయన ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం దేవుడి హుండీలో వేసేసినట్టున్నారు కాబోలు అందుకే తిరుపతి నుంచి ఇక్కడికి రాగానే మాట మార్చేశారు. అలా ఎందుకన్నాను.. అంటూ దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. 

చెవిలో పువ్వు

ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌రావు ఏమన్నాడంటే..బీజేపీ అభ్యర్థినైన నన్ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రులను ఒప్పించి నిధులు తెచ్చి వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను మరింత డెవలప్‌మెంట్‌ చేసుకునే అవకాశం ఉంటుందని సవినయంగా దుబ్బాక ఓటర్లకు విజ్ఞప్తిచేస్తున్నాను. 

తిరుపతి నుంచి రాగానే మాట మార్చిన రఘునందన్‌.. 

‘కేంద్రం నుంచి నిధులు తెచ్చి చేస్తానని నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చెప్పలేదు’ అంటూ ఉత్తరకుమారుడి ఫోజ్‌ పెట్టడంతో కంగుతినడం కాషాయ కార్యకర్తల వంతైంది. బీజేపీ నేతల మాటలు నీటి మీద రాతలని తేలిపోయింది. అందుకే పారాహుషార్‌! గ్రేటర్‌ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వాళ్లు గుప్పించిన హామీలన్నీ మురికికాలువలో కలిసిపోతాయి.