కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఇటీవల వచ్చిన ఎఫ్2 చిత్రంలో హనీ పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 అనే సినిమా చేస్తుంది. ఈ మూవీని ఆగస్ట్ 27న విడుదల కానుంది.
గత కొద్ది రోజులుగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరగనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలని నిజం చేస్తూ శుక్రవారం మెహ్రీన్- భవ్య నిశ్చితార్ధం జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇవి వైరల్‌గా మారాయి.