మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 20:10:43

మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై హింస‌ను ఎదుర్కొనేందుకు 'సంఘ‌మిత్ర‌'

మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై హింస‌ను ఎదుర్కొనేందుకు 'సంఘ‌మిత్ర‌'

హైదరాబాద్‌ : మహిళలను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాచకొండ పోలీసులు సంఘమిత్ర ను ప్రారంభించారు. మహిళలు, పిల్లలపై జరిగే హింసను అరికట్టడం, ఇందుకు సంబంధించిన అవగాహనను వారికి కల్పించడం, నేరాలపై పోరాడటానికి సంసిద్ధులను చేయడం వంటి తదితర అంశాలపై సంఘమిత్ర పనిచేస్తుంది. ఈ కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత సమాజం, సంఘాల నుండి సమర్థవంతమైన మహిళలను గుర్తించి వారిని శిక్షణ పొందిన వాలంటీర్ల బృందంగా తయారు చేయనున్నారు. వీరు వివిధ రకాలుగా హింసలను ఎదుర్కొంటున్న మహిళా బాధితులకు సహాయాన్ని అందిస్తారు. 

ఈ క్రమంలో భాగంగా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉమెన్స్‌ ఫోరం భువనగిరి నుండి సంఘమిత్ర కోసం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా పిల్లల సంరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు, ఆర్‌కేఎస్‌సీ ఉమెన్స్‌ జాయింట్‌ సెక్రటరీ లతా రామ్‌, సంఘమిత్రా లీడ్‌ అర్చనా మన్నే, మహిళా ఫోరం సభ్యులు రజనీ, శివ కరాడి, శాలిని, జయశ్రీ, సావిత్రి, అడిషనల్‌ డీసీపీ సలీమా, భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి సంఘమిత్రలో 300 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. వీరితో ఐదు గంటల అవగాహన సమావేశం నిర్వహించారు. కౌన్సెలింగ్‌, మహిళా చట్టాలు, బాలల హక్కులు, బాల్య వివాహాలు, ఇతర సంబంధిత అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.

VIDEOS

logo