శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 18:38:01

రాచకొండ పరిధిలో టి-కన్సల్ట్‌ యాప్‌ ప్రారంభం

రాచకొండ పరిధిలో టి-కన్సల్ట్‌ యాప్‌ ప్రారంభం

హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌భగవత్‌ టి-కన్సల్ట్‌ యాప్‌ను శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటీటీఏ) సహకారంతో హెల్త్‌ ఇన్‌ ఏ స్నాప్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ టెలిమెడిసిన్‌ యాప్‌ను దేశంలో మొదటి సారిగా సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులోకి తెచ్చినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్‌భగవత్‌ మాట్లాడుతూ..  టీ-కన్సల్ట్‌ యాప్‌తో టెలీమెడిసిన్‌ సౌకర్యం తమ ముందుకు వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వైద్య సేవల విషయంలో ఊపిరి పీల్చుకునే విధంగా చేసిందన్నారు. పోలీస్‌ సిబ్బంది అందరికీ టెలిమెడిసిన్‌ అండ్‌ ఈ-డాక్టర్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వివిధ రంగాలలో నిపుణులైన వైద్యులకు సంబంధించిన స్లాట్స్‌ ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.  ముందుగా అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకొని సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు టీటీటీఏ విభాగం అధికారులు పాల్గొన్నారు. 


logo