బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 18:03:58

లాక్‌డౌన్‌లో రాచకొండ పోలీస్‌ ట్రావెల్స్‌

లాక్‌డౌన్‌లో రాచకొండ పోలీస్‌ ట్రావెల్స్‌

లాక్‌డౌన్‌ కారణంగా ఆరోగ్య విషయాలపై వైద్యులను సంప్రదించేందుకు, చికిత్స నిమిత్తం దవాఖానలకు వెళ్లేందుకు రాష్ట్రమంతటా వాహనాలు కరువయ్యాయి. దవాఖానలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదంటూ పెద్ద సంఖ్యలో తమకు అందుతున్న ఫిర్యాదులకు రాచకొండ పోలీసులు సమాధానం కనుగొన్నారు. గర్భిణీలు, డయాలిసిస్‌కు నిత్యం వెళ్లాల్సినవారు, షుగర్‌, బీపీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారిని దవాఖానలకు తీసుకొనిపోయి తిరిగి ఇంటి దగ్గర దిగబెట్టేందుకు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌.. స్థానిక ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో ఒప్పందం చేసుకొన్నారు.

గర్భిణీలు, నిత్యం డయాలిసిస్‌కు వెళ్లే రోగులు, అత్యవసరంగా దవాఖానలకు వెళ్లాలనుకొనేవారు ఇకపై రాచకొండ పోలీసులు టై ఆప్‌ చేసుకొన్న శ్రీనివాస ట్రావెల్స్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఐదు కార్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరిన్ని కార్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. రాచకొండ పోలీసుల చొరవతో ఎందరో సమయానికి దవాఖానలకు చేరుకోగలుగుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాకుండా మీరు ఉంటే.. మీ కోసం ఎలాంటి సేవలు అందించేందుకైనా మేం సిద్ధమని మహేశ్‌ భగవత్‌ సూచిస్తున్నారు.


logo