బుధవారం 27 మే 2020
Telangana - May 21, 2020 , 19:39:20

నిస్సహాయులకు సేవలు.. రాచకొండ కమిషనర్‌ అభినందన

నిస్సహాయులకు సేవలు.. రాచకొండ కమిషనర్‌ అభినందన

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరంగా వైద్య పరీక్షలు, మందులు, గర్భిణులను, నిస్సహాయులకు అందించేందుకు రాచకొండ పోలీసులు, శ్రీనివాస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం సంయుక్తంగా ప్రారంభించిన క్యాబ్‌ సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు 122 మంది ఈ క్యాబ్‌ల ద్వారా వారికి సంబంధించిన వైద్య సేవల కోసం  ఉపయోగించుకుని ఉపశమనం పొందారు. ఈ నేపధ్యంలో గురువారం ‌ శ్రీనివాస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంతో పాటు డ్రైవర్‌లు, ఈ అపరేషన్‌లను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారి రవికుమార్‌ల సేవలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. డ్రైవర్‌లకు నగదు బహుమతిని అందించారు. logo