శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 12:13:34

రాచ‌కొండ ప‌రిధిలో 12 శాతం త‌గ్గిన నేరాలు

రాచ‌కొండ ప‌రిధిలో 12 శాతం త‌గ్గిన నేరాలు

హైద‌రాబాద్ : రాచ‌కొండ పోలీసు క‌మిషన‌రేట్ వార్షిక నేర నివేదిక‌ను సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. రాచ‌కొండ క‌మిషన‌రేట్ ప‌రిధిలో నేరాలు 12 శాతం త‌గ్గాయ‌ని తెలిపారు. సీసీఎస్‌లో 229 ప్రాప‌ర్టీ కేసులు న‌మోదు అయ్యాయి. రూ. 3.86 కోట్లు రిక‌వ‌రీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఎస్‌వోటీ విభాగంలో 892 కేసులు న‌మోదు కాగా, రూ. 5.95 కోట్లు స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. నేరాలు చేసిన నిందితుల‌కు 51 శాతం శిక్ష‌లు ప‌డ్డాయ‌న్నారు. లోక్అదాల‌త్‌లో 5,548 కేసులు ప‌రిష్కారం అయ్యాయ‌ని తెలిపారు. న‌లుగురు చెడ్డీగ్యాంగ్ నిందితుల‌కు మూడేళ్ల జైలుశిక్ష విధించామ‌ని వెల్ల‌డించారు. 82 మందిపై పీడీ చ‌ట్టం ప్ర‌యోగించామ‌ని తెలిపారు. రాచ‌కొండ ప‌రిధిలో 704 సైబ‌ర్ క్రైమ్ కేసులు న‌మోదయ్యాయ‌ని పేర్కొన్నారు. 

సీసీ కెమెరాల ద్వారా 136 కేసులు.. 

ఈ ఏడాది 12 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని, 136 కేసులు సీసీ కెమెరాల ద్వారానే ఛేదించామ‌ని తెలిపారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా 4,926 ఫిర్యాదులు స్వీక‌రించామ‌న్నారు. డ‌య‌ల్ 100కి 1.66 ల‌క్ష‌ల కాల్స్ వ‌చ్చాయ‌న్నారు. 2,525 మంది త‌ప్పిపోగా 2,233 మందిని గుర్తించాం. షీ టీమ్స్ 23 బాల్య వివాహాల‌ను అడ్డుకున్నాయ‌ని సీపీ తెలిపారు.