మంగళవారం 26 మే 2020
Telangana - May 20, 2020 , 01:08:38

కేసీఆర్‌ రైతు బాంధవుడు

కేసీఆర్‌ రైతు బాంధవుడు

  • దేశానికి ఆయన నాయకత్వం అవసరం
  • ప్రముఖ నటుడు ఆర్‌ నారాయణమూర్తి

సీసీసీ నస్పూర్‌: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతుబాంధవుడని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్‌ నారాయణమూర్తి ప్రశంసించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి అతిథిగృహంలో మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరమ న్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని కోరారు. లాక్‌డౌన్‌ తర్వాత అన్ని రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించాలని విజ్ఞప్తిచేశారు. అన్ని రాష్ర్టాల సీఎంలను, ప్రజలను ఏకంచేయడానికి ఇది మంచి అవకాశమని అభిప్రాయప డ్డారు. తెలంగాణలో రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తూ, విభిన్న పంటల సాగుకు కేసీఆర్‌ నాందిపలకడం శుభ పరిణామమ న్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమై ప్రాజెక్టని వ్యాఖ్యా నించారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ చర్యలను అభినం దించారు. సీఎం కేసీఆర్‌ను గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. 


logo