e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides బీసీ భగత్‌కే మద్దతు

బీసీ భగత్‌కే మద్దతు


సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉందాం
నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
బీసీకి టికెట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రాజకీయాలకు అతీతంగా బీసీ కులాలకు గౌరవం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య
టీఆర్‌ఎస్‌ వెంటే 14 బీసీ సంఘాలు 47 కుల సంఘాలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (నమస్తే తెలంగాణ): బీసీలకు అండగా నిలిచిన టీఆర్‌ఎస్‌ను నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బలపర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్‌ ఉపఎన్నికలో బీసీలకే అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశామని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్‌ ఇచ్చారని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకతీతంగా బీసీలను గౌరవించిన టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత బీసీ ప్రజలపైనే ఉన్నదని పేర్కొన్నారు. ఓయూలో విద్యార్థి దశలో నోముల నర్సింహయ్య బీసీ విద్యార్థుల సంక్షేమానికి పాటుపడ్డారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా బీసీవర్గాల అభ్యున్నతికి కృషిచేశారని కొనియాడారు. ప్రజాఉద్యమాల్లో విస్తృతంగా పాలుపంచుకున్న నోముల కుటుంబానికి అండగా నిలువాలని కృష్ణయ్య పిలుపునిచ్చా రు. రాజకీయంగా ఎదిగివచ్చినప్పుడే బీసీవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

సంఘాల సంపూర్ణ మద్దతు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న 14 బీసీ సంఘాలు, 47 కుల సంఘాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని రాష్ట్ర ఎంబీ సీ సంఘం ప్రతినిధి సంగెం సూర్యారావు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సం ఘం అధ్యక్షుడు నీలం వెంకటేశ్‌, బీసీ రక్షకదళ చైర్మన్‌ ఉదయ్‌నేత, తెలంగాణ కుమ్మరి సంఘం అధ్యక్షుడు నడికుడి జయంత్‌రావు, రా ష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేందర్‌గౌడ్‌, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ అధ్యక్షుడు అనంతయ్య, తెలంగాణ మేదరి సం ఘం ప్రధానకార్యదర్శి కేపీ మురళీకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఫ్రంట్‌ తదితర సంఘాలు తెలిపాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీసీ భగత్‌కే మద్దతు

ట్రెండింగ్‌

Advertisement