శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:56

వర్గీకరణ కోసం మహోద్యమం

వర్గీకరణ కోసం మహోద్యమం

  • మా కొట్లాట కేంద్రంతోనే.. మాలలతో కాదు
  • ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి

ఖైరతాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంపై మహోద్యామానికి సిద్ధమవుతున్నామని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై మాదిగ జేఏసీ, టీఎమ్మార్పీఎస్‌, ఎంహెచ్‌పీఎస్‌, అంబేద్కర్‌ సంఘాల సమితి, వివిధ దళిత సంఘాలతో లక్డీకాపూల్‌లోని హోటల్‌ సెంట్రల్‌ కోర్టులో సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచే అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఏపీ సీఎం జగన్‌ కూడా వర్గీకరణకు మద్దతుగా నిలువాలని కోరారు. 

తమ కొట్లాట మాలల మీద కాదని, వర్గీకరణ అంశంపై కేంద్రం చేతిలో ఉన్నదని, వారిపైనే పోరాటం చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు ఆధారంగా నవంబర్‌, డిసెంబర్‌లో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్‌ నేత ఇటుక రాజు, నాయకులు భరత్‌భూషణ్‌, రాపోలు రాములు, జీవ మాదిగ, పరమేశ్వర్‌, భాస్కర్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo