e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home Top Slides అడుగు దూరంలో వైద్యం

అడుగు దూరంలో వైద్యం

అడుగు దూరంలో వైద్యం
  • 7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు
  • మారుమూల జిల్లాల్లోనూ సూపర్‌ స్పెషాలిటీ సేవలు
  • గోల్డెన్‌ అవర్‌లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు
  • కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్‌ ముందడుగు

హైదరాబాద్‌, జూన్‌ 12 (నమస్తే తెలంగాణ): ‘నా రాష్ట్ర ప్రజలు నిత్యం ఆయురారోగ్యాలతో ఉండాలి..’ ఇదే సీఎం కే చంద్రశేఖర్‌రావు లక్ష్యం. దాన్ని సాధించేందుకు వైద్యరంగాన్ని శాశ్వతప్రాతిపదికన బలోపేతం చేస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అనేది పెద్దోళ్ల హక్కే కాదు.. పేదోళ్ల హక్కూ అని చాటిచెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సొం త నిధులతో వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు సీఎం శాయశక్తులా కృషిచేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌కే మెరుగైన వైద్యం పరిమితం కాకుం డా, రాష్ట్రం నలుమూలలా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 4 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేశారు. ఇప్పుడు మరిన్ని కాలేజీలకు ఓకే చెప్పి పేదలకు వైద్యాన్ని మరింత దగ్గరగా చేస్తున్నారు. 7 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సిద్ధం చేయడం సహా ఇతర అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తిచేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకొంటున్నది.

జిల్లా దవాఖానల అప్‌గ్రేడేషన్‌, నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు, పరిశీలన, అనుమతుల మంజూరు వేగంగా జరిగితే రెండేండ్లలోనే ఈ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆరోగ్యరంగం ముఖ చిత్రమే మారనున్నది. తెలంగాణలో ఏ మూలన ఉన్నా కేవలం గంటలోనే దవాఖానకు చేరే సౌకర్యం కలుగనున్నది. ఊపిరికి విలువైన చివరి క్షణాలు (గోల్డెన్‌ అవర్‌) పూర్తయ్యేలోగా దవాఖానకు చేరుకొనే, వైద్యం అందించే వెసులుబాటు దక్కనున్నది. కొత్త మెడికల్‌ కాలేజీలు పూర్తయితే ఒక్కో దవాఖానలో 650 పడకలు, 150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే దాదాపు 6 వేల పైచిలుకు పడకలు, వెయ్యికిపైగా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -

ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 9 వైద్యవిద్య కాలేజీల్లో 1,615 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, మరో వెయ్యి సీట్లు అదనంగా కలువనున్నాయి. పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నా యి. కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ ఉండగా, అక్కడ 50 సీట్లు మాత్రమే ఉన్నా యి. మిగిలిన అన్ని చోట్లా నర్సింగ్‌ కాలేజీలు ఏర్పా టు చేయాల్సి ఉన్నది. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటు చేయబోయే నర్సింగ్‌ కాలేజీకి 100 సీట్ల దాకా రానున్నాయి. అనుబంధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

కేంద్ర సహకారం లేకున్నా..

కేంద్ర కోటాలో రాష్ర్టానికి ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా రాలేదు. కేంద్రం మెడికల్‌ కాలేజీలు మంజూ రు చేస్తే 60% నిధులు కేంద్రం, 40% నిధులు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో రాష్ట్రప్రభుత్వమే నిధులు ఖర్చుచేస్తున్నది. తాజాగా ఏర్పా టు చేయబోయే ఒక్కో మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్ల దాకా ఖర్చు అవుతుందని, నర్సింగ్‌ కాలేజీకి మరో రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన రూ.3,850 కోట్లు అవసరం.

ఆరోగ్యరంగంలో కీలక అడుగు

7 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు అనేది తెలంగాణ ఆరోగ్యరంగంలో కీలక అడుగు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించింది. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం 4 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. బీబీనగర్‌ ఎయిమ్స్‌ కోసం 6 నెలల్లోపు 200 ఎకరాలు, పెద్ద భవనం అందజేశాం. ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కృషి చేసింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో మారుమూలప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువకానున్నది.
డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అడుగు దూరంలో వైద్యం
అడుగు దూరంలో వైద్యం
అడుగు దూరంలో వైద్యం

ట్రెండింగ్‌

Advertisement