సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 03:19:31

నగరం చుట్టూ క్వారంటైన్‌

నగరం చుట్టూ క్వారంటైన్‌

  • 5 వేల మందికి సరిపడా కేంద్రాలు
  • 2,300 పడకలతో 28 ఐసొలేషన్‌ కేంద్రాలు
  • ఐదుచోట్ల కరోనా నిర్ధారణ ల్యాబ్‌లు
  • విదేశాల నుంచి వచ్చిన 750 మందిపై నజర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నది. హైదరా బాద్‌ నలుమూలల క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. గచ్చిబౌలి స్టేడియం, మేడ్చ ల్‌ జిల్లాలోని దూలపల్లి, వికారాబాద్‌ జిల్లాలోని టూరిజం ప్లాజాతోపాటు నగరం చు ట్టూ ఐదువేల మందికి సరిపడా క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అనుమానితులకు చికిత్స అందించేందుకు ఉస్మానియా, గాంధీ, నల్లకుంటలోని ఫీవర్‌, ఎర్రగడ్డ ఛాతి, కింగ్‌కోఠి దవాఖానలతోపాటు మరో 28 ప్రైవేటు దవాఖానల్లో సైతం 2,300 పడకలతో ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటుచేశారు. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కోసం గ్రేటర్‌లో ఐదు చోట్ల ల్యాబ్‌లు ఏర్పాటుచేశారు. చైనా, ఇటలీ, ఇరాన్‌, మలేషియా, అమెరికా తదితర 14 కరోనా ప్రభావిత దేశాలనుంచి నగరానికి వచ్చినవారిపై జీహెచ్‌ఎంసీ అధికార యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారానికి ఈ తరహా వ్యక్తులు 750 మందిని గుర్తించిన అధికారులు వారి ఇండ్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశారు. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కొత్త స్ట్రాలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో  బ్రీత్‌ ఎనలైజర్‌కు ప్రతి వాహనదారుడికి కొత్త స్ట్రా బిగించే తనిఖీ చేస్తామని పోలీసుశాఖ ప్రకటించింది. ఈ చర్య  వల్ల కరోనా సోకుతుందనే భయం లేదని ట్రా ఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు అన్నారు.


logo