హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రతి విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకు ప్రైవేటు కంపెనీలు కూడా అంగీకరించడంతో వానకాలం సీజన్ నుంచే విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ వల్ల కంపెనీల పేరుతో మార్కెట్లోకి వచ్చే నకిలీ విత్తనాలను సులువుగా గుర్తించవచ్చు. కోడ్‌ను స్కాన్ చేయగానే అవి ఏ సంస్థ విత్తనాలు, ఎక్కడ పండించారు, ఎప్పుడు ప్యాకింగ్ చేశారు వంటి వివరాలు తెలుస్తాయి. ఇతర కంపెనీలు సొంతంగానే సర్టిఫై చేసుకొని విత్తనాలను విక్రయిస్తున్నందున విత్తనాభివృద్ధి సంస్థ పరిధిలోకి రావడం లేదు. ఆ సంస్థల విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.