ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 13:11:49

హైకోర్టులో పీవీపీకి ఊరట

హైకోర్టులో పీవీపీకి ఊరట

హైదరబాద్‌ : వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించారు పీవీపీ. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఆదేశాలు ఇచ్చేవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గోడ వివాదంలో కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీవీపీ తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంటిపై దాడి చేసేందుకు 15 మందిని పంపించాడని ఆరోపించారు కైలాష్. logo