బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 00:04:52

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన పీవీ తన తల్లిపై, పుట్టినగడ్డపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగం ప్రారంభించబోతూ భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో ‘ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకునే’ అని అన్నారు. తన ముందు ప్రసంగ పాఠం ఉన్నా, అందులో లేని అంశాలను ప్రస్తావిస్తూ నోట మాటలు రాని స్థితికి ఆయన వెళ్లిపోయారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు శ్రోతల హృదయాలను కదిలించాయి. ‘దేశంలో ఇవాళ రాజులు పోయారు. అయినా రాజ్యాలు నడపటం తప్పదు. ఎవరో ఒకరు నడపాలి. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి వస్తే తల్లి ఒడిలోకి వచ్చిన అనుభూతి కలుగుతున్నది’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని, తాను పుట్టిన గ్రామం ఈ రాష్ట్రంలోనే ఉందని, ఈ గడ్డమీదే ఓనమాలు దిద్దుకున్నానని, ఈ నేలపైనే దేశసేవ చేస్తూ తొలి అడుగులు వేశానన్నారు. తన ఆప్తమిత్రులు, బంధువులు ఇక్కడే ఉన్నారని, ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన చోటు అని వ్యాఖ్యానించారు.logo