ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 01, 2020 , 23:57:08

విల్లీ బ్రాంట్‌ ఆదర్శం..

విల్లీ బ్రాంట్‌ ఆదర్శం..

సరళీకరణ విధానాలను అమలు చేయడం మొదలు పెట్టిన పీవీ నరసింహారావును చాలా మంది మరొక మార్గరెట్‌ థాచర్‌ అంటూ కీర్తించేవారు. ఇదే విషయమై రాజకీయ శాస్త్రవేత్త జేమ్స్‌ మేనర్‌ ఒక సందర్భంలో ‘మీకు ఆదర్శం ఎవరు’ అంటూ పీవీని అడిగారు. అందుకు ఆయన ‘నా ఆదర్శం మార్గరెట్‌ థాచర్‌ కాదు. నాకు విల్లీ బ్రాంట్‌ ఆదర్శం. సంపద ధనికుల నుంచి పేదలకు బొట్టు బొట్టుగా జారుతుందనే సిద్ధాంతాన్ని నేను నమ్మను’ అంటూ బదులిచ్చారు. ఇక పీవీ ఆదర్శంగా తీసుకున్న విల్లీ బ్రాంట్‌ జర్మనీ ఛాన్సలర్‌. నోబెల్‌ బహుమతి గ్రహీత. ఆయన ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించి, ఫలితంగా వచ్చిన పన్నులను సామాజిక రంగాలకు మళ్లించి పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు.


logo