శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Jul 04, 2020 , 01:58:41

ఇండియన్‌ రూజ్‌వెల్ట్‌

ఇండియన్‌ రూజ్‌వెల్ట్‌

సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గట్టెక్కించడమే కాకుండా, ప్రగతి పథంలో పయనింపజేశారు పీవీ నరసింహారావు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పీవీని ఇండియన్‌ రూజ్‌వెల్ట్‌ అని కీర్తించేవారు. అమెరికాలో 1928-32లో మహా మాంద్యం ఏర్పడి, ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. అప్పుడే 1933లో ఆ దేశాధ్యక్షుడైన రూజ్‌వెల్డ్‌ ‘న్యూ డీల్‌' అనే కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. అదే తరహాలో పీవీ నరసింహారావు కూడా భారత్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తనదైన ‘న్యూడీల్‌' పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఆర్థిక, సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. ప్రగతిపథంలో భారత్‌ను పరుగులు పెట్టించారు.