బుధవారం 15 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 00:08:07

ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకొని..

ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకొని..

పీవీ ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. ఇది స్వయంగా ఆయన వెల్లడించిన నిజం. ఇంగ్లాడు వెళ్లి ఖగోళశాస్త్రం చదవాలని, ఆస్ట్రోనాట్‌గా స్థిరపడాలనేది పీవీ ఆకాంక్ష. అందుకోసమే ఆయన బీఎస్సీ చదివారు. అయితే డిగ్రీ పూర్తయ్యాక ఇంటికి తిరిగిరావాలని,  కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండాలని కుటుంబం నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎటు వెళ్లాలి? ఏం చేయాలి? దేశం కోసం ఉద్యమంలో దిగాలా? ఇంగ్లాండులో ఖగోళశాస్త్రం చదవాలా? ఇంటికొచ్చి ఆస్తిపాస్తులను చూసుకుంటూ కుటుంబంతో గడపాలా? అని తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు. తరువాత ఎట్టకేలకు నాగ్‌పూర్‌లో న్యాయశాస్త్రం చదవడానికే మొగ్గు చూపారు. తొలుత అయిష్టంగానే  అటువైపు అడుగులు వేసినా ఏకంగా స్వర్ణపతకాన్ని సాధించారు.


logo