ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 00:26:19

సంజయ్‌ దర్బారా?

సంజయ్‌ దర్బారా?

ఢిల్లీ.. 1975 జూన్‌ 26 ఉదయం.. పీవీ తన నివాసంలో కూర్చుని ఆకాశవాణి వింటుండగా అకస్మాత్తుగా మధ్యలో ఒక ప్రధాన వార్తా ప్రకటన వెలువడింది. అది ఎమర్జెన్సీకి సంబంధించింది. ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో సమావేశానికి వెళ్ళేసరికి ఆ మీటింగు హాలు అంతా ఆమె కొడుకు సంజయ్‌గాంధీ దర్బార్‌లా కనిపించింది. సంజయ్‌గాంధీ అసహనంతో, ఆవేశంతో శరపరంపరగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అక్కడున్నవాళ్లంతా ఏదో తడుముకుంటూ సమాధానాలు చెప్తున్నారు. అప్పట్లో సంజయ్‌గాంధీ రాజ్యాంగాతీత శక్తిగా చెలరేగిన సంగతి తెలిసిందే. పీవీని విస్మయానికి గురిచేసింది అక్కడ ఇందిర వైఖరి. ఆ యువరాజు సంధిస్తున్న ప్రశ్నాస్ర్తాలకు ఆమె ఆగి ఆగి సంకోచిస్తూ సంజాయిషీ  ఇస్తున్నారు. పీవీ అనుకున్నారు.. ‘ఏమిటీ అపర దుర్గ, కాళీ కూడా ఇలాగ..?’.