శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 00:15:36

పీవీ గురుభక్తి

పీవీ గురుభక్తి

నిజాం వ్యతిరేక పోరాట కాలంలో వందేమాతరం గీతం పాడి ఇక్కడి విద్యాలయం నుంచి బహిష్కరణకు గురైన పీవీ మహారాష్ట్రలోని నాగపూర్‌లో చదువుకున్నారు. నాడు పీవీకి చదువు చెప్పిన గురువు 1980లలో చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే ఆ గురువు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పీవీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఔరంగాబాద్‌లో దిగారు. ఒక పల్లెలోని ఒక చిన్న ఇంటికి చేరుకొని అక్కడ ఏర్పాటుచేసిన చిన్న సంస్మరణ సమావేశంలో మరాఠీలో ప్రసంగించి గురువు రుణం తీర్చుకున్నారు. పీవీతోపాటు విమానంలో వెళ్లినవారిలో ఒకరైన ప్రముఖ పాత్రికేయుడు సంజయ్‌బారు ఈ విషయం వెల్లడించారు.logo