గురువారం 02 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 23:49:03

80ల్లోనే కంప్యూటర్‌ నేర్చుకున్నారు

80ల్లోనే కంప్యూటర్‌ నేర్చుకున్నారు

పీవీ ఓ గొప్ప విద్యార్థి. ఆయనకు వయసుతో పనిలేదు. అనుకున్నారంటే నేర్చుకోవాల్సిందే. పీవీతో రాజీవ్‌ గాంధీ.. ‘రాబోయేదంతా కంప్యూటర్‌ యుగమండీ.. కచ్చితంగా గ్లోబ్‌ను కంప్యూటరే డామినేట్‌ చేస్తది.. కానీ ఈ ముసలివాళ్లతోనే చిక్కొచ్చి పడింది. వీళ్లు మార్పును స్వాగతించరు.. మారరు’ అని అన్నారు. దీంతో పీవీకి కోపమొచ్చి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి కంప్యూటర్‌ పట్టుకొని రమ్మన్నారు. ఆ విధంగా వేగంగా కంప్యూటర్‌ నేర్చుకొని జీవితం చివరి దశ వరకు కంప్యూటర్‌ మీదనే పని చేశారు. ఆయనకు అంత పట్టుదల ఉండేది. ఆపరేటర్‌ను పెట్టుకునే అవకాశం ఉన్నా, స్వయంగా కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసేవారు. కోబాల్‌, బేసిక్‌, కోరల్‌, సీ, సీపీపీ వంటి లాంగ్వేజీలు నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు ప్రోగ్రాం కోడింగ్‌ కూడా రాసేవారు. తన కార్యక్రమాల షెడ్యూల్‌ను కంప్యూటర్‌లోనే పొందుపరుచుకునేవారు. సాంకేతికతపై ఆసక్తితో విద్యాశాఖమంత్రిగా ఉన్నపుడు 1986 నూతన విద్యా విధానంలో కంప్యూటర్‌కు సంబంధించి పలు కీలక అంశాలను చేర్చారు.

దేవదాసు సినిమా ఇష్టం

పీవీ నరసింహారావుకు సినిమాలు అంటే ఇష్టం. పాటలు కూడా బాగా పాడేవారు. ఉర్దూ గజళ్లు వినేప్పుడు అందులో లీనమైపోయేవారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సినిమాలు చూసేవారు. సినిమాలు చూశాక అందులోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలను స్నేహితులకు చెప్పే అలవాటు పీవీకి ఉండేది. దేవదాసు, నర్తకి, విద్యావతి, పునర్మిలన్‌, ఆద్మీ, జిందగీ, కిస్మత్‌ వంటి సినిమాలు ఆ రోజుల్లో ఇష్టంగా చూశారు. సమకాలీన సమాజంలోని సమస్యలు, సంస్కరణలు 

సినిమాల్లో ఇతివృత్తంగా ఉండాలని పీవీ వాదించేవారు.


logo