బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:21

అపూర్వంగా పీవీ స్మారకం

అపూర్వంగా పీవీ స్మారకం

  • త్వరలో అంతర్జాతీయ స్థాయిలో సెమినార్‌ 
  • పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మెమోరియల్‌ను భారీస్థాయిలో అపూర్వంగా నిర్మించేలా డిజైన్‌ ఖరారుచేస్తామని శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు తెలిపారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖుల మెమోరియల్‌ను పరిశీలించి తుది డిజైన్‌ను సిద్ధంచేస్తామన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కేకే నివాసంలో ఉత్సవ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ , ప్రభుత్వ సలహాదారు రమణాచారి  హాజరయ్యారు.

ఈ సమావేశంలో పీవీ మెమోరియల్‌కు సంబంధించిన డిజైన్‌లను అర్కిటెక్ట్‌ చూపించారు. డిజైన్‌లపై మంత్రి కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ ఒక్కరిదే కాకుండా ఇతర జాతీయ స్థాయి ప్రముఖుల మెమోరియల్‌లను పరిశీలించి వాటికంటే బాగుండే విధంగా డిజైన్‌ చేయాలన్నారు. వారం తర్వాత మెమోరియల్‌ డిజైన్‌లను పరిశీలిస్తామని చెప్పారు. పీవీపై త్వరలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని, దీనికి పీవీతో పరిచయం ఉన్న ఇతర దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తామని కేకే తెలిపారు.


logo