మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:45

జీపులన్నీ వాపస్‌..!

జీపులన్నీ వాపస్‌..!

నీతి, నిబద్ధతకు పీవీ మారుపేరుగా నిలుస్తారు. పార్టీ ఎన్నికలలో ప్రచారం కోసం మద్రాసు (చెన్నై)లోని మహేంద్ర కంపెనీ వాళ్లు జీపులు పంపించేవారు. ప్రచారం తరువాత ఆ జీపులను వారికి తిరిగి అప్పగించాల్సి ఉండేది. అందులో చాలా మంది పార్టీ నాయకులు జీపులను తిరిగి కంపెనీకి అప్పగించేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ప్రచారం కోసం జీపులను తెప్పించే పూర్తి భాద్యత పీవీ నరసింహారావు మీదనే పడింది. ఆ సమయంలో పీవీ 200 జీపులను ప్రచారానికి తెప్పించారు. ప్రచారం ముగిసిన తరువాత ప్రతి అభ్యర్థి నుంచి జీపులన్నింటినీ తిరిగి తెప్పించి వాటిని అంతే జాగ్రత్తగా అప్పగించి సదరు మహేంద్ర కంపెనీని, మిగతా నాయకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 


logo