శనివారం 04 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:01:10

పీవీ రచనల ముద్రణ, స్మారకం కేంద్రం ఏర్పాటు : సీఎం కేసీఆర్‌

పీవీ రచనల ముద్రణ, స్మారకం కేంద్రం ఏర్పాటు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : వీపీ నరసింహారావు రచించిన రచనలను వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పీవీ రచనలను విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు వెల్లడించారు. పీవీ రచనలను పలు భాషల్లో ముద్రిస్తామని సీఎం చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వంగర, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో శాశ్వతంగా పీవీ చిత్రపటం ఉండేలా చూస్తామన్నారు.

పార్లమెంటులోనూ పీవీ నరసింహారావు చిత్రపటం ఉండాలన్నారు. అదేవిధంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు. ముఖ్యలతో కలిసి వెళ్లి పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరతామన్నారు. పీవీ పేరిట పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్లాలని కేశశరావు సూచించారు. హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టే విషయమై కూడా ప్రధానికి లేఖ రాస్తామని తెలిపారు. 

పీవీ జ్ఞానభూమిలో స్మారకం కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. రామేశ్వరంలో అబ్దుల్‌ కలాం స్మారకం మాదిరిగా ఏర్పాటు చేస్తామన్నారు. పీవీ జయంతి ఉత్సవాల కమిటీ రామేశ్వరం సందర్శించనున్నట్లు తెలిపారు. కలాం స్మారకానికి మించిన విధంగా పీవీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జులై 28లోగా పీవీ జ్ఞానభూమిలో స్మారకం ఏర్పాటు కావాలని సీఎం అన్నారు. పీవీ పేరుతో కాకతీయ వర్సిటీలో రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పెరు పెట్టాలన్నారు. ప్రజలు కోరితే తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతామన్నారు. పీవీ రచనల పునఃముద్రణ జరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.


logo