బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 03:33:26

పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ

పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ

తెలుగు యూనివర్సిటీ : పదవులకే వన్నెతెచ్చిన పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలే దేశాభివృద్ధికి బాటలు వేశాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కిరణం సాహితీ సంయుక్తాధ్వర్యంలో పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి మహోత్సవం సందర్భంగా పీవీ నరసింహారావు జీవితం-సాహిత్యం ఇతివృత్తంగా నిర్వహించిన వచన కవితల పోటీల విజేతలకు శుక్రవారం ఏసీగార్డ్స్‌లోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో నగదు బహుమతులను అందజేసి సత్కరించారు. సీనియర్‌ జర్నలిస్టు బైస దేవదాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవీ ఆదర్శజీవి కవితకు ప్రముఖ రచయిత పులిపాక నందకిశోర్‌, భూమిపుత్రుడు కవితకు శ్రీధర్‌ కొమ్మోజు, స్థిత ప్రజ్ఞుడు కవితకు చివుకుల వాసుదేవమూర్తికి నగదు పురస్కారాలను రమణాచారి అందజేసి అభినందించారు. సాహితీవేత్తలు వెంకటరెడ్డి, రఘురామ్‌, సుబ్బారావు పాల్గొన్నారు.logo