శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:42

పీవీ గ్లోబల్‌ మనిషి

పీవీ గ్లోబల్‌ మనిషి

  • ‘కరణం’ పుస్తకావిష్కరణలో పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు వ్యాఖ్య

అంబర్‌పేట: మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు ప్రపంచ మనిషి అని, ఆయన ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని పీవీ సోదరుడు, సర్వార్ధ సంక్షేమ సమితి చైర్మన్‌ పీవీ మనోహరరావు అన్నారు. పాలమూరు బ్రాహ్మణ నియోగ సంఘం ఆధ్వర్యంలో బండారు రాంప్రసాద్‌రావు సభాధ్యక్షతన నల్లకుంట న్యూరామాలయం ఆడిటోరియంలో కరణం పుస్తకావిష్కరణ జరిగింది.

పీవీ తనయుడు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కూతురు సురభి వాణీదేవి, పీవీ మనవడు ఎన్‌వీ సుభా ష్‌, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, పాలమూరు నియోగ సంఘం అధ్యక్షుడు తాటిపర్తి వెంకటరావులతో కలిసిఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోహర్‌రావు మాట్లాడుతూ.. పీవీ శతజయంతి వేడుకలు విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయని, అందుకే ఆయన గ్లోబల్‌ మనిషి అని అన్నారు. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక విప్లవం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు.


logo