బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 12:26:07

ఖమ్మంలో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు

ఖమ్మంలో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు

ఖమ్మం : దేశ ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక రంగాన్ని ఒక మలుపు తిప్పిన ధీశాలి, అపర చాణక్యుడు, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీనరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ శత జయంతి దినోత్సవం సందర్భంగా జిల్లా కాలెక్టరేట్ ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలోని ప్రతి ఊరికి పీవీ గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా ఆయనఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పీవీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. తొలిగా ఖమ్మం నుంచే ప్రారంభిస్తామని అన్నారు. ఖమ్మం లకారం సర్కిల్లో వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రంలో మనమే ముందుగా ప్రతిష్ఠించాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. 


logo