e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ 28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు

28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు

28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు
  • ముఖ్య అతిథులుగా గవర్నర్‌, సీఎం కేసీఆర్‌
  • ఏర్పాట్లపై కమిటీ చైర్మన్‌ కేకే సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు తెలిపారు. ఈ నెల 28న హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం బీఆర్కే భవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడంపై అధికారులకు ఎంపీ కేశవరావు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు
28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు
28న పీవీ శతజయంతి ముగింపు వేడుకలు

ట్రెండింగ్‌

Advertisement