గురువారం 16 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 00:38:28

51 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు

51 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు

  • టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను 51 దేశాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్టు టీఎర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌బిగాల చెప్పారు. శతజయంతి ఉత్సవాల కమిటీలో తనను సభ్యుడిగా నియమించడంపై సంతోషం వ్యక్తంచేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఈఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలకు అన్నిదేశాల్లో ఏర్పాట్లుచేస్తున్నట్టు వివరించారు.

ఆస్ట్రేలియాలో శతజయంతి వేడుకలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, కాన్‌బెర్రా, అడిలైఫ్‌, బ్రిస్సేన్‌ నగరాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు.

తాజావార్తలు


logo