శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 11:55:27

వాకర్స్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

వాకర్స్  ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మంలోని వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మహాత్మా గాంధీ జయంతి రోజున మినీ లకారం ట్యాంక్ బండ్ నందు గల వాకర్స్ ప్యారడైజ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరానికి మరో మణిహారంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో పార్క్ ను ఆధునీకరించి వాకింగ్, జాగింగ్, యోగ, ఓపెన్ జిమ్, గ్రీనరి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక సదుపాయాలు కల్పించామన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా బల్క్ చెత్తను సేకరించేందుకు ‘Waste on wheels’ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కు  ప్రశంసా పత్రాలు, టోపీ(Cap) ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.