శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 13:16:44

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు అవసరమైన నివాసానికి అవసరమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఇండ్లను అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.