గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:26:05

మంత్రి కేటీఆర్‌కు పువ్వాడ కృతజ్ఞతలు

మంత్రి కేటీఆర్‌కు పువ్వాడ కృతజ్ఞతలు

  • ఖమ్మంలో అభివృద్ధికి రూ.30 కోట్లు విడుదలపై హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం మున్సిపల్‌ పరిధిలో సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ నెల 7న కేటీఆర్‌ ఖమ్మంలో ఐటీ హబ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని కేటీఆర్‌కు పువ్వాడ విజ్ఞప్తిచేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.30 కోట్ల నిధుల విడుదలకు కృషిచేశారు. సంబంధించిన జీవో నంబర్‌ 415 ప్రతిని పువ్వాడకు నేరుగా అందజేశారు.


logo